పోలీస్ స్టేషన్‌కు చేరిన మటన్ పంచాయితీ..

marrage-29.jpg

పెళ్లి విందులో వధువరుల తరపు బంధువులు మటన్ ముక్కల కోసం కొట్లాటకు దిగారు. విందులో వడ్డించిన భోజనంలో మటన్ ముక్కలు తక్కువ వచ్చాయంటూ మొదలైన ఘర్షణ కాస్త చినికిచినికి గాలివానగా మారింది. పరస్పర దాడులతో ఉద్రిక్తంగా మారింది. వరుడి తరపు బంధువులు, వధువు తరపు వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడిన ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో బుధవారం జరిగింది. నిజామాబాద్‌ నవీపేట ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌హాలులో బుధవారం వివాహం జరిగింది. వివాహం అనంతరం జరిగిన విందులో వరుడి తరపున పెళ్లిక హాజరైన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు. తమకు తక్కువ మటన్‌ ముక్కలు వేశారంటూ వడ్డించే వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వడ్డించే వారిని దూషించడంతో గొడవ మొదలైంది. వధువు తరపు బంధువులు కల్పించుకుని సర్ది చెబుతున్న క్రమంలో ఇరు పక్షాల మధ్య గొడవ తీవ్రమైంది.

Share this post

scroll to top