రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ ఓవర్సీస్‌ రైట్స్‌‌..

ram-charan-20.jpg

ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్. తమిళ దర్శక దిగ్గజం శంకర్ తెలుగులో చేస్తున్న తొలి స్ట్రెయిట్ మూవీ ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అప్పట్లో జరగండి జరగండి సాంగ్ మినహా మరే మేజర్ అప్‌ డేట్ ఈ మూవీ నుంచి రాలేదు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఏదైనా ట్రీట్ ఇస్తారనుకుంటే అదీ లేకపోవడంతో అభిమానులు బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్‌ను రిలీజ్ చేస్తామని ఇటీవలే నిర్మాత దిల్‌రాజ్ చెప్పి కాస్తంత ఊరట కలిగించారు. మొన్నామధ్య థమన్ మాట్లాడుతూ ఆగస్ట్ చివరి నుంచి వరుసగా అప్‌డేట్స్ వస్తాయన్నారు. నిజానికి జరగండి ఫస్ట్ సాంగ్ గతేడాది దీవాళికే రావాల్సి ఉంది.

కానీ పాట లీక్ కావడం, సోషల్ మీడియాలో నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో ట్యూన్‌ లో మార్పులు చేసి చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి తన పాత్ర షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆలస్యమై విమర్శలు ఎదుర్కొంటు ఉండటంతో శంకర్ కూడా చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు. ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసిన తర్వాత రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని ఇటీవలే శంకర్ కూడా వెల్లడించారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Share this post

scroll to top