తెలంగాణలో ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు అన్నీ పార్టీ ఫిరాయింపుల చుట్టే తిరుగుతున్నాయి. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరుతున్న ప్రజా ప్రతినిధులపై బీఆర్‌ఎస్ నాయకులు గొంతు చించుకొని తప్పు పడుతున్నారు. అయితే వారంతా ఈ పరిణామాలపై 2014 నుంచి జరిగిన పార్టీ ఫిరాయింపుల గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేది. అంతే కాదు తెలుగుదేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిలను పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు ఇప్పుడు మాట్లాడేవారు ఎందుకు మాట్లాడలేదో మరి! కారు దిగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఎమ్మెల్యేల కోసం కేసీఆర్ గడీ తలుపులు తెరుచుకున్నాయి. ఎమ్మెల్యేలతో మాజీ సీఎం బంతి భోజనాలు చేస్తున్నారు. ఎవరూ పార్టీ మారొద్దని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. ‘గేట్లు ఎత్తేశాం’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వెనుక ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ‘రాష్ట్రంలో నిరంకుశ పాలన పోవాలి, మార్పు కావాలి’ అంటూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
కాంగ్రెస్ గేట్లు ఎందుకు ఎత్తింది..
