తెలంగాణలో హైడ్రా హీట్ కొనసాగుతోంది. అధికార పార్టీ నేతల ఫామ్ హౌస్‌లపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండటంతో కొందరు నేతలు క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన ఫామ్ హౌస్ ప్రభుత్వ నిబంధనల మేరకే ఉందన్నారు. ఒకవేళ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నట్లయితే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానన్నారు. ఇరవై ఏళ్ల క్రితమే అన్నీ పరిశీలించి, అధికారులతో కూడా చర్చించి ఫామ్ హౌస్ నిర్మించామన్నారు పట్నం మహేందర్ రెడ్డి. ఈ మధ్య సర్వే చేసి బఫర్ జోన్‌లో లేదని అధికారులు నివేదిక ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి తన పేరు తెరపైకి తెచ్చి ఆరోపణలు చేస్తున్నారని, తన ఫామ్‌హౌజ్ రూల్స్‌కు విరుద్ధంగా అక్కడే కూల్చేద్దామన్నారు.
ఫామ్ హౌస్‌లపై రగడ..
