కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు భౌతిక దాడికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు జర్నలిస్ట్ సంఘాలు రాజకీయ ప్రముఖులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే జల్‌పల్లి లో మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటనను పోలీస్ శాఖ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు తాజాగా, మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. కాగా, బుధవారం ఉదయం 10.30 గంటలకు కమిషనరేట్‌లో విచారణకు హాజరు కావాలంటూ సీపీ ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఆయన వద్ద ఉన్న గన్‌ను కూడా సరెండర్ చేయాలని తెలిపారు.
మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి..
