నాపై ఈడీ దాడులు జరిగే అవకాశముంది..

rahul-2.jpg

బీజేపీపై విమర్శలు చేసినందుకు ఈడీతో సోదాలు చేయించాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. అయితే ఈడీ దాడుల కోసం తాను ఎదురు చూస్తున్నానని ఆయన తెలిపారు. తన ప్రసంగం నచ్చని కొందరు వ్యక్తులు ఈ దాడులకు పూనుకుంటున్నారని అన్నారు. ఆరుగురు వ్యక్తులు దేశాన్ని నాశనం చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. తనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేసే అవకాశముందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈ విషయాన్ని ఈడీ వర్గాల్లో తనకు కొందరు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఈడీ కార్యాలయంలో పనిచేస్తున్న వారే తనకు ఈ సమాచారం ఇచ్చారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. పార్లమెంటులో తాను చేసిన ప్రసంగంపై గుర్రుగా ఉన్న కొందరు ఈడీ దాడులకు ఉసిగొల్పుతున్నారన్నారు.

Share this post

scroll to top