RC17లోనూ అదే ఒరవడి..

ram-charan-3.jpg

రంగస్థలం తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో RC17 చిత్రానికి ఓకే చెప్పాడు రామ్‌చరణ్‌.. ట్రిపుల్‌ ఆర్‌, గేమ్‌ఛేంజర్‌ చిత్రాలకు ఎక్కువ సమయం తీసుకున్న రామ్‌చరణ్‌ ఇక వేగంగా సినిమాలు తీయాలనే ఆలోచనతో వరుసగా కొత్త ప్రాజెక్టులకు కమిట్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో బుచ్చిబాబు సెట్స్‌పై రాబోతుండగా, సుకుమార్‌ సినిమాకు కూడా అంతా రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. రామ్‌చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ఛేంజర్ సినిమా ఫినిష్ చేశాడు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో నెక్ట్స్‌ మూవీలో నటించనున్నాడు. మరో వైపు స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ కూడా పుష్ప2 సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇటు రాంచరణ్, అటు సుకుమార్ ఇద్దరూ తమ సినిమాలను డిసెంబర్‌ బరిలో ఉంచారు.

Share this post

scroll to top