టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు బిగ్ సినిమా ఫ్యామిలీస్ లో మెగా కుటుంబం అలాగే అక్కినేని కుటుంబం అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్ లో మొత్తం నాలుగు టాప్ ఫ్యామిలీస్ ఉంటే వాటిలో ఏ కుటుంబపు హీరో కానీ మరో హీరోతో కలిసి బిగ్ స్క్రీన్ ని షేర్ చేసుకోవడం వంటివి అభిమానులకి ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. ఇలా టాలీవుడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ కలయిక జరిగింది. ఈ కాంబినేషన్ కి జక్కన్న రాజమౌళికి ఉన్న లింక్ ఏంటో కూడా రివీల్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న వార్తలు నిహారిక, అఖిల్ కలిసి నటించనున్నారు అనే వార్తల్లో ఎలాంటి లేదట. ఎందుకంటే ఆల్రెడీ వారిద్దరూ కలిసి నటించడం ఎప్పుడో జరిగిపోయింది. అది కూడా సినిమా కోసం కాదు ఒక షార్ట్ ఫిలిం వీరిద్దరూ చేశారట. దీనిని ఎస్ ఎస్ రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తికేయ దర్శకత్వం వహించడం జరిగిందట. మరి అసలు ఈ షార్ట్ ఫిలిం ఏమయ్యిందో కూడా రివీల్ అయ్యింది. మెగా డాటర్ నిహారిక ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ అఖిల్ నేను నటించిన షార్ట్ ఫిలిం రిలీజ్ ఆగిపోయింది అని తెలిపింది. తాము నటించిన ఆ చిట్టి చిత్రం మొత్తం అవుట్ పుట్ చూసి రాజమౌళి గారు రిలీజ్ ఆపెయ్యమని చెప్పారట. అనుకున్న రేంజ్ లో అవుట్ పుట్ రాలేదు కనుకే జక్కన్న షార్ట్ ఫిలిం ని రిలీజ్ చెయ్యొద్దని కార్తికేయకి చెప్పారట.
సీక్రెట్ గా నిహారిక, అఖిల్..
