హిట్ 3 వేదికపై మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు రాజమౌళి. మహాభారతంలో నాని చేయబోయే క్యారెక్టర్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాని పక్కాగా ఆ సినిమాలో కనిపించబోతున్నారంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో మరోసారి జక్కన్న మహాభారతం గురించి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చ మొదలైంది. రాజమౌళి, ప్రజెంట్ నాని పేరు మాత్రమే చెప్పినా… గతంలో మరో ఇద్దరి పేర్లు కూడా రివీల్ చేశారు. తన కాంపౌండ్ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, ప్రభాస్ మహాభారతంలో నటిస్తారంటూ చాలా రోజుల కిందటే కన్ఫార్మ్ చేశారు. దీంతో వాళ్లు ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారన్న డిస్కషన్ జరుగుతోంది.
తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అంటూ చాలా వేదిక మీద చెప్పారు రాజమౌళి. ఈ జనరేషన్లో పౌరాణిక పాత్ర చేసే సత్తా ఉన్న టాప్ స్టార్స్ ఎవరంటే ముందు ఎన్టీఆర్ పేరే గుర్తుకు వస్తుంది. నటుడిగా ఎన్టీఆర్ ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పండించగలరు. అందుకే మెయిన్ క్యారెక్టర్ తారక్‌కు పడే ఛాన్స్ ఉంది. రాజమౌళి తన కెరీర్లో ఎక్కువ కాలం ప్రభాస్‌తోనే ట్రావెల్ చేశారు. అందుకే డార్లింగ్‌ను ఫ్యామిలీ మెంబర్‌గానే ట్రీట్ చేస్తారు జక్కన్న. ఆల్రెడీ బాహుబలి, కర్ణుడి పాత్రలో అదరగొట్టిన ప్రభాస్ లేకుండా రాజమౌళి మహాభారతాన్ని ఊహించలేం. సో డార్లింగ్ కూడా మెయిన్ లీడ్‌లో కనిపించటం పక్కా.