మొదలైన రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ..

rajaya-sabha-3.jpg

రాష్ట్రంలో రాజ్యసభ కు సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ముగ్గురు సభ్యుల రాజీనామాలతో ఖాళీ అయిన మూడు స్థానాలకు గాను ఇవాళ్టి నుంచి నామినేషన్ల ను స్వీకరించనున్నారు. డిసెంబర్ 10తో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ముగియనుంది. కాగా, వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగిన మోపిదేవి వెంకట‌రమణ, బీదా మస్తాన్ రావు, బీసీ నాయకుడు అర్‌.కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండింటికి నాలుగేళ్లు, ఒక స్థానానికి రెండేళ్ల పదవీ కాలం ఉంది. ఈ క్రమంలోనే ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలోకి దిగుబోతున్నారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, టీడీపీ నుంచి మరోసారి బీద మస్తాన్ రావు మరోసారి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

Share this post

scroll to top