గ్లామర్‌తో టాలీవుడ్‌ను బుట్టలో పడేసి స్టార్స్ అందరినీ తనవైపు తప్పుకుంది రకుల్. కెరీర్‌లో ఒకట్రెండు హిట్స్ కొట్టి అరడజను ఛాన్సులు వేనకేసుకుని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ అదృష్టం మొహం చాటేయడంతో అసలుకే ఎసరొచ్చింది. కళకళలాడిన కెరీర్ మసకబారుతోంది. ఒకటా రెండా వరసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు. తెలుగు, తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశే. రారండోయ్ వేడుకచూద్దాం తర్వాత ఎన్నో సినిమాలు చేసినా తెలుగులో సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా మన్మథుడు2లో ఈ అమ్మడు పోషించిన క్యారెక్టర్ విమర్శలు తీసుకొచ్చింది. స్మోక్ చేసి కెరీర్‌కు పొగ పెట్టుకుంది రకుల్.
హిందీలో ‘దే దే ప్యార్ దే’తో హిట్ కొట్టి బాలీవుడ్ ఆఫర్స్‌ను వెనకేసుకుందన్న పేరేగానీ రకుల్‌కు మరో హిట్ పడలేదు. హిందీలో నటించిన సినిమాలన్నీ ఫ్లాపే కావడంతో అక్కడ కూడా ఛాన్సులు తగ్గాయి. హిందీలో నటించిన లాస్ట్ మూవీ ‘మేరే హస్పెండ్ కీ బివి’ ఫ్లాప్ అయింది. కంటిన్యూస్ ప్లాపులు ఆఫర్స్ లేకపోయినా ఎప్పుడూ జనాలకు టచ్‌లో వుంటూనే వుంది రకుల్. చేతిలో సినిమాల్లేక కావాల్సినంత ఖాళీ దొరికింది. గ్లామర్‌గా ఫోజులివ్వడం లేదంటే ఫిట్‌నెస్ చాటున ఒయ్యారాలు ఒలకబోస్తూ కవ్వించాలని చూసినా తెలుగు హీరోల్లో ఒక్కరూ కనికరించి ఛాన్స్ ఇవ్వలేదు. తెలుగులో ఆఫర్స్ లేకపోయినా హిందీలో చివరిసారిగా ‘దేదే ప్యార్‌దే’ సీక్వెల్‌తో అదృష్టం పరీక్షించుకోనుంది రకుల్. మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే ఈ క్రేజీ సీక్వెల్ సక్సెస్ చాలా అవసరం. భారతీయుడు3 చేతిలో వున్నా ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు.