పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు ? అంటూ సోషల్ మీడియాలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి రామ్ చరణ్ హింట్ ఇచ్చారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితుడు ప్రభాస్ పెళ్లి గురించి హింట్ ఇచ్చాడు. ఆయన ఎవరిని పెళ్లాడనున్నారనే విషయాన్ని ఇటీవల పాల్గొన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో బయటపెట్టారు. ఈ షోలో ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్ చరణ్ నవ్వులు పూయించారు. ఆంధ్రప్రదేశ్ లోని గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. దీంతో ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ హింట్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు ఆ అమ్మాయి ఎవరా ? అంటూ నెట్టింట ఆరా తీస్తున్నారు.