ఉపాసన సోషల్ మీడియా వేదికన ఓ ఆవేదన చెందుతూ ఓ పోస్ట్..

upasana-15.jpg

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె కేవలం మెగా ఫ్యామిలీ కోడలిగానే కాకుండా అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తుంది. ఉపాసన గొప్పతనం గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు.  ఇప్పటికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ వంటి 150 రాష్ట్రాల్లోని వృద్ధాశ్రమాలకు సహాయం చేస్తూనే ఉంది. అయితే నేడు దేశవ్యాప్తంగా ప్రజలందరూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదికన ఓ ఆవేదన చెందుతూ ఓ పోస్ట్ పెట్టింది. మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నామని నిలదీసింది. కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచారంపై మెగా కోడలు మాట్లాడింది. మానవత్వాన్ని అపహాస్యం చేసే దారుణమైన ఘటన ఇదని ఫైర్ అయింది. ప్రస్తుతం కూడా సొసైటీలో అనాగరికత కొనసాగుతుంటే మనం ఎలాంటి స్వాతంత్య్యాన్ని జరుపుకుంటున్నామని గొంతెత్తి ప్రశ్నించింది. దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక అని మహిళల్ని కొనియాడింది. ఎక్కువ మంది మహిళల్ని వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకురావాలన్నదే తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. స్త్రీలందరికీ మర్యాద, ఒక సెక్యూరిటీ అందించేందుకు అందరూ కృషి చేయాలని ఉపాసన సోషల్ మీడియా వేదికన మహిళల గురించి మాట్లాడుతూ కాస్త ఫైర్ అయింది.

Share this post

scroll to top