నా సీక్రెట్ సెల్ఫీలన్నింటినీ మీ టైమ్‌లైన్‌లో పడేస్తున్నాను..

rasmika-03.jpg

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్ నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి గొప్ప గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప రెండు భాగాల్లో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. బాలీవుడ్ ప్రముఖ హీరో రణబీర్ కపూర్ సరసన అవకాశం దక్కించుకుని మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. రణబీర్ కపూర్‌కు భార్యగా యానిమల్‌లో కనిపించి తన సత్తా చాటింది. ఇక రష్మిక మందన్న సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోని ఫ్యాన్స్‌తో మాత్రం తప్పకుండా టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పలు ఫొటోలు పంచుకుని నా సీక్రెట్ సెల్ఫీలన్నింటినీ మీ టైమ్‌లైన్‌లో పడేస్తున్నాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్న పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Share this post

scroll to top