డిఫరెంట్‌ షేడ్స్‌లో తారక్‌..

devara-27.jpg

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో ఒకటి దేవర కొరటాల శివ. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్ టైటిల్‌లో రోల్‌లో నటిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్‌27 న గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన టీం ఫియర్‌, చుట్టమల్లె సాంగ్స్ లాంచ్ చేయగా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతున్నాయి. తాజాగా కొత్త లుక్‌ షేర్ చేశారు మేకర్స్‌. భయం ముఖ చిత్రాలు అంటూ తారక్‌ కొంచెం నవ్వు మరికొంచెం రౌద్రరూపంలో కనిపిస్తూ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాడు. ఇప్పుడీ పోస్టర్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఒక నెలలో బిగ్‌ స్క్రీన్‌పైకి దేవర రాక. ఆ అనుభూతి ప్రపంచాన్ని కదిలిస్తుంది. సెప్టెంబర్ 27న థియేటర్లలో దేవర మ్యాడ్‌నెస్‌ని అనుభవిద్దాం అంటూ రిలీజ్ చేసిన లుక్ నెట్టింటిని షేక్ చేస్తోంది.

Share this post

scroll to top