బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామం..

harish-rao-31-.jpg

బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో ఇప్పుడు ప్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు. ఇప్పుడు బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన, అనాలోచిత అసమర్థ విధానాలే కారణం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత దిగజారడం, పాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేకపోవడం, అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడం, మూసి, ఫార్మా సిటీ, మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలు చేయడం అని హరీశ్ రావు అన్నారు.

అలాగే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకపోవడం భవన నిర్మాణ అనుమతులకు బలవంతపు వసూళ్లు చేయడం, కొత్త పెట్టుబడులు రాకపోవడంతో పాటు ఇతర రాజకీయ, ఆర్థిక పరిణామాలు రియల్ ఎస్టేట్ రంగంపై గడిచిన 14 నెలల కాంగ్రెస్ పాలనలో పెను ప్రభావాన్ని చూపాయని హరీశ్ రావు ఆరోపించారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం అంటే బిల్డర్లకు స్వర్గధామంగా ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు బిల్డర్లకు నరకం చూపిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, నేను రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి వచ్చాను రియల్‌ ఎస్టేట్‌ గురించి నాకు చెప్తారా? అని మీడియా సమావేశంలో దబాయించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని చేజేతులా నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు.

Share this post

scroll to top