రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొన్నం ప్రభాకర్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల పూర్తి..
