ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి..

ravanth-3.jpg

పదేళ్ల పాలనలో రూ.లక్ష కోట్లు వెనకేశారు రాష్ట్ర ప్రజలు వరదలతో అతలాకుతలం అవుతున్న ఈ పరిస్థితిలో కనీసం రూ.2 వేల కోట్లన్నా సీఎం సహాయ నిధికి ఇవ్వొచ్చు కదా’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పర్యటించి వరద సాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో కనీవినీ ఎరగని అవినీతి చోటుచేసుకుందన్నారు.

కేసీఆర్ కుటుంబం వద్ద రూ.లక్ష కోట్లు ఉన్నాయని ఆరోపించారు. అందులో కనీసం రూ. వేల కోట్లు విరాళం ఇవ్వాలని హితవు పలికారు. రాష్ట్రంలో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారని విమర్శించారు. అక్కడి నుంచి ట్విట్టర్ లో రాజకీయం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలను తిప్పికొడుతూ ఖమ్మంలో పువ్వాడ అజయ్ అక్రమాల గుట్టు తేల్చేద్దాం రమ్మంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ.5‌0 లక్షల పరిహారం ఇవ్వాలని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ ఆ నిధులు కేంద్రం నుంచి మీరే ఇప్పించాలని కోరారు. 

Share this post

scroll to top