ఎట్టకేలకు డాక్టర్ పట్టా పొందిన సాయి పల్లవి ఇక యాక్టింగ్‌కు దూరం కానుందా..

sai-paklavi-08.jpg

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ప్రేమమ్ మూవీతో మలయాళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుణ్ తేజ్ ‘ఫిదా’ సినిమాతో అందరి మనసులు దోచేసింది. ఇందులో సాయి పల్లవి అందం, అభినయం, నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా, సాయి పల్లవి డాక్టర్ పట్టా పొందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జార్జియా దేశంలోని టిబిలీసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం సాయి పల్లవి జార్జియాలోని MBBS గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుని వచ్చింది. అంతేకాకుండా గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా తన ఫ్రెండ్స్‌తో ఫుల్ ఎంజాయ్ చేసింది. ఈ అమ్మడు పోస్ట్ పెట్టనప్పటికీ.. పట్టా పొందిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక వాటిని చూసిన ఫ్యాన్స్ యాక్టింగే కాదు డాక్టర్ కూడా అని కామెంట్లు పెడుతూ సంతోషిస్తున్నారు. కానీ మరి కొందరు మాత్రం ఇకనుంచి సినిమాల్లో యాక్టింగ్ చేస్తుందా? లేక డాక్టర్ అయి ప్రజలకు సేవ చేస్తూ ఇండస్ట్రీకి దూరం అవుతుందా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Share this post

scroll to top