మా అనుబంధం ఎంత చెప్పినా తక్కువే..

sam-25.jpg

అందాల భామ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవ్వడానికి రెడీ అవుతుంది. పాన్ ఇండియన్ హీరోయిన్స్ గా దూసుకుపోతుంటే తాను కూడా రేస్‌కు రెడీ అంటూ సిద్దమవుతుంది సామ్. మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరమైన ఈ చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. సమంతకు తెలుగు, తమిళ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటించింది. ఈ చిత్రంలో నటుడు విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది ఈ అమ్మడు ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత నటి సమంత అనారోగ్య సమస్యలతో సినిమాల్లో సినిమాలకు దూరం అయ్యింది.

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి సామ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. రాహుల్‌ రవీంద్రన్‌ తో తన అనుబంధాన్నిపంచుకుంది సామ్. తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు రాహుల్ తనతోనే ఉన్నాడని తెలిపింది సమంత. ఉదయం, సాయంత్రం తనతోనే ఉండి తనను జాగ్రత్తగా చూస్కున్నాడని తెలిపింది సామ్. మా అనుబంధానికి పేరు పెట్టలేను. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే రాహుల్ నా స్నేహితుడా, సోదరుడా , కుటుంబ సభ్యుడా, రక్తసంబంధీకుడా అని చెప్పలేను అని చెప్పుకొచ్చింది సమంత. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Share this post

scroll to top