సందీప్ రెడ్డి వంగా ఈ పేరుకే ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాను అలా తీయాలి, ఇలా తీయాలి అనే రూల్స్ ను బ్రేక్ చేసిన డైరెక్టర్. నా ఇష్టం వచ్చినట్టు తీస్తా అని కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. తీసింది మూడు సినిమాలే. అందులో ఒకటి రీమేక్. అంటే వర్జినల్ గా తీసింది రెండు సినిమాలతోనే ట్రెండ్ సెట్ చేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ కే కండీషన్లు పెడుతున్నాడంట. ఎందుకంటే సందీప్ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నాడు. స్క్రిప్టు పనులు దాదాపు పూర్తయినట్టే తెలుస్తోంది. ప్రభాస్ మొదటిసారి ఇందులో పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. సందీప్ డైరెక్షన్ లో ఆరడుగల ప్రభాస్ అంటే ఊచకోత మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెట్టుకుంటున్నారు.
రెబల్ స్టార్ కు కొత్త రూల్స్..
