కాగ్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తెలుగు అధికారి..

telugu-21-.jpg

ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కొండ్రు సంజయ్‌ మూర్తి చేపట్టారు. కాగ్‌ అధిపతిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించింది. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి అరుదైన రికార్డ్ సృష్టించారు. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్‌ మూర్తి కుమారుడు సంజయ్‌ 1964 డిసెంబర్ 24న జన్మించారు. 1989లో ఐఏఎస్‌ అధికారిగా హిమాచల్‌ ప్రదేశ్‌ కేడర్‌కు ఎన్నికై ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. 2021 సెప్టెంబర్ నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా విధులు నిర్వహించారు.

Share this post

scroll to top