తెలంగాణ రైతులకు నేడు పండుగ రోజు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీలో భాగంగా రెండో విడత నిధులను ఈరోజు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్ష లోపు రుణాలు తీసుకున్న వారిలో 11లక్షల 37వేల మందికి తొలి విడతగా 18వ తేదిన నగదు జమ చేసింది ప్రభుత్వం. మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు రెండే విడతలో భాగంగా ఈరోజు లక్ల రూపాయల నుండి లక్షన్నర లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనుంది. రాష్ట్రంలో లక్షన్నర లోపు రుణాలు తీసుకున్న రైతుల జాబితాను కూడా సేకరించింది సర్కారు. రెండో విడత రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోమధ్యాహ్నం 12గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు. అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాల కలెక్టరెట్లలో రైతు రుణమాఫీకి సంబంధించిన నగదు జమ కార్యక్రమాన్ని చేపట్టనుంది ప్రభుత్వం.రూ.లక్ష నుంచి లక్షన్నర లోపు రుణాలు మాఫీ కానున్నాయి. అన్నీ జిల్లా కలెక్టరెట్లు, ఐటీడీఏ ఆఫీసుల దగ్గర రైతులకు ఈ రుణమాఫీ నిధులు అందుకుంటారు.
రెండో విడత నిధులను ఈరోజు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనుంది..
