ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా..

bigg-boss-16.jpg

అందరు అనుకున్నదానికి రివర్స్ లో  శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ ను విడిచి వెళ్ళాల్సి వచ్చింది. శేఖర్ భాష పెర్ఫామెన్స్  విషయంలో ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. అంతే కాదు ఛాన్స్ వచ్చినప్పుడల్లలా  హౌస్ మెంట్స్ శేఖర్ ను టార్గెట్ చేస్తూ. పెద్దగా యాక్టీవ్ గా ఉండటం లేదు అని కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. చిన్నది కాదు అది చాలా పెద్ద విషయమే అనుకోవాలి. నామినేషన్స్ లో అందరు సేవ్ అయ్యి చివరగా శేఖర్ భాష‌ ఆదిత్య ఓం ఉండగా వారిలో ఎవరిని బయటకు పంపాలో హౌస్ మెంట్స్ కు ఓటింగ్ పెట్టారు. దాంతో సీత తప్పించి  అందరూ ఆదిత్యకు పాజిటీవ్ గా ఓటు వేసి ఆయన్ను అవమానించి బయటకు పంపించేశారు. 

కనీసం  మేజర్ ఓట్లు ఆదిత్యకు వచ్చిన తరువాత కూడా శేఖర్ కు ఫార్మాలిటీగా కూడా ఎవరూ ఓటు వేయలేదు. దాంతో ఆయన అంత పెద్ద తప్పుఏం చేశాడా అని ఆడియన్స్ కూడా కోపంగా ఉన్నారు. ఇక బయటకు వెళ్తూ శేఖర్ భాషా ఫేక్ ఎవరు రియల్ ఎవరు అని చెప్పాడు. రియల్ బోర్డ్ పై విష్ణు ప్రియ, సీత, ప్రేరణ ఫోటోలు. ఫేక్ బోర్డ్ పై సోనియా, మణికంఠ, ఆదిత్య ఓం ఫోటోలు పెట్టాడు. సోనియా రెండు ముఖాలతో ఉంటోంది. ఆమె చాలా డేంజర్ అన్నట్టుగా చెప్పాడు. మణికంఠ కూడా ఫేస్ లో ఫేక్ ఎమోషన్స్ చూపిస్తున్నాడన్నారు. ఇక విష్ణు ప్రియ అమాయకురాలు అని అన్న శేఖర్.. సీత తన చెల్లెలిగా చెప్పుకున్నాడు. 

Share this post

scroll to top