నేడే తమిళనాడులో డీలిమిటేషన్‌పై మీటింగ్‌..

stalin-22.jpg

డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు సమర శంఖారావాన్ని పూరించాయి. ఇప్పటికే ఢిల్లీ వేదికగా తమిళనాడు డీఎంకే ఎంపీలు పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం జరగబోతుంది. శనివారం తమిళనాడు వేదికగా దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం జరగనుంది.

చెన్నైలోని గిండి సమీపంలో ఐటీసీ ఛోళా హోటల్‌లో ఉదయం 10 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలతో పాటు ఆయా పార్టీల కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని.. కేవలం దక్షిణాది ఉనికి కోసమే నేతలందరూ రావాలని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా హాజరుకానున్నారు.

Share this post

scroll to top