ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు రైతు పండుగను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనున్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సదస్సుకు అన్ని జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. నేడు జరిగే సదస్సుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు, రేపు ఇతర జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
నేటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్ నగర్ రైతు పండగ..
