ఓటీటీ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్..

janvi-26.jpg

జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఓటీటీ హీరోయిన్ అన్న ముద్ర చెరిపేసుకుంటోంది. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస పెట్టి ఉమెన్ సెంట్రిక్ ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు చేయడంతో డిజిటల్ డ్రామా గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు 12 సినిమాలు చేస్తే పావు వంతు సినిమాలు ఓటీటీని పలకరించినవే. మిస్ అండ్ మిసెస్ మహీ నుండి థియేట్రికల్ పిక్చర్ల వైపే మొగ్గు చూపుతోంది ఈ క్యూటీ పై. చివరి సారిగా ఓటీటీ కోసం వరుణ్ ధావన్‪తో బవాల్ మూవీ చేసింది జాన్వీ. జాన్వీ కపూర్ మరోసారి ఓటీటీపై మనసు పారేసుకుంటోంది. తమిళ ఆడియన్స్‌ను పలకరించేందుకు ప్రిపేర్ అవుతున్న మేడమ్ ఓటీటీనే ఆశ్రయిస్తోంది. పారంజిత్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

ఎప్పటి నుండో ఈ వెంచర్ గురించి ఇద్దరి మధ్య డిస్కర్షన్ జరుగుతుందని, ఫైనల్ స్టేజ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమెన్ సెంట్రిక్ సిరీస్‍గా రూపు దిద్దుకోబోతున్నట్లు సమాచారం. నీలం ప్రొడక్షన్ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నట్లు టాక్. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఖాతాలో ప్రజెంట్ మూడు బిగ్ ప్రాజెక్టులున్నాయి. హిందీలో సన్నీ సంస్కారీ తులసి కుమారి, పరమ్ సుందరి, తెలుగులో పెద్ది చిత్రాల్లో నటిస్తోంది. ప్రజెంట్ ఈ ప్రాజెక్టులన్నీ సెట్స్‌పై ఉన్నాయి. అలాగే ఇంకొన్ని కథలు కూడా వింటుందని టాక్. అల్లు అర్జున్- అట్లీ సినిమా కోసం ఆమె పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇన్ని బడా ప్రాజెక్టులు బిగ్ హీరోల సినిమాలు చేస్తోనన బోనీ తనయ ఈ టైంలో మరోసారి ఓటీటీల వైపు చూస్తూ  కెరీర్‌ను రిస్క్‌లో పెట్టేసుకుంటోంది జాన్వీ.

Share this post

scroll to top