సీఎం కేజ్రీవాల్‎కు సుప్రీం కోర్టులో ఊరట.. బెయిల్ విషయంలో అసలు ట్విస్ట్ ఇదే..

delhi-12-.jpg

కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. విస్తృత స్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యులున్న ధర్మాసనానికి కేసును బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్‎ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే 90రోజులుగా సీఎం కేజ్రీవాల్ జ్యూడీషియల్ రిమాండ్‎లో ఉన్నారు. మార్చి 21న లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‎ను అరెస్ట్ చేశారు. దానిపై విచారణ జరిపారు. అదే క్రమంలో ఆయన బెయిల్ కోసం అనేక సార్లు కోర్టును ఆశ్రయించారు సీఎం కేజ్రీవాల్. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రచారం నిమిత్తం 21 రోజుల పాటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే ఆ బెయిల్‎ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్ ను కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు. దీనిపై స్పెషల్ కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. దీంతో కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు స్పెషల్ కోర్టులో పలుసార్లు బెయిల్ పిటిషన్‎ను దాఖలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇక మధ్యంతర బెయిల్ ముగియడంతో పోలింగ్‌ ముగిసిన తర్వాత కౌంటింగ్‎కు రెండు రోజుల ముందు జూన్ 2న తిరిగి తిహార్‌ జైల్లో కేజ్రీవాల్‌ లొంగిపోయారు.

Share this post

scroll to top