తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. గతంలో కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ మేరకు స్పీకర్ తరఫున నిన్న సాయంత్రం అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అందులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు అనడం సరైందికాదని అనర్హత చట్టం ప్రకారం స్పీకర్ నడుచుకుంటున్నారని తెలిపారు. అలాగే ఈ వ్యవహారంలో పిటిషనర్లు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల ఇష్యూపై స్పీకర్‌ను ఆశ్రయించిన వెంటనే వారు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. అలాగే దురుద్దేశంతో పార్టీ ఫిరాయింపులపై వేసిన పిటిషన్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. కాగా ఈ వ్యవహారంపై నేడు విచారణ జరగనుండగా కోర్టు తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన స్పీకర్..
