గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. అంజలి, సముద్రఖని, SJ సూర్య సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ‘గేమ్ చేంజర్’ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు.
ఇటీవల ఇందులోంచి విడుదలైన రెండు పాటలు, టీజర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ‘గేమ్ చేంజర్ మూడో పాట అప్డేట్ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చాడు. ఈ మేరకు ‘X’ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. రెడీగా ఉండండి. మెలోడీ సాంగ్ రాబోతుంది అని రాసుకొచ్చాడు. కానీ డేట్‌ను మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే ఈ పాటకు సంబంధించిన షూట్ స్విట్జర్లాండ్ లో జరిగినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.