ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..

satyanarayana-22.jpg

ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ప్రజల్లో తిరగలేకపోతున్నా సమాధానం చెప్పలేకపోతున్నా ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్లో ప్రస్తావించి నిధులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. మాడుగుల చోడవరం ప్రజలు టీడీపీకీ ఓటు వేయలేదా? ప్రశ్నించే వేదిక ఇదే నేను ప్రెస్ మీట్ పెట్టి అడగడం లేదు. ఆరోపించడం లేదు. అందుకే మహానాడు ద్వారా మంత్రులను నియోజకవర్గం ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా అంటూ బండారు వ్యాఖ్యానించారు.

Share this post

scroll to top