రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంగళవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంధ్ర భారతి స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే అనుకున్న సమయానికి ఫలితాలు విడుదల చేయడంలో కొత్త ఆలస్యం నెలకొనే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. తాజా సమాచారం మేరకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్లో ఉదయం 9 గంటలకు బేగంపేట నుంచి విజయవాడకు బయల్దేరుతారు.
కాస్త ఆలస్యంగా పదో తరగతి ఫలితాలు..
