తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరరైంది. ఈ నెల 12న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ అధినాయకత్వం తో సీఎం రేవంత్ ఈ మేరకు చర్చలు చేసారు. మంత్రివర్గంలో ఖాళీల భర్తీ తో పాటుగా శాఖల మార్పు పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. తన ప్రతిపాదనల తో రేవంత్ తన ఢిల్లీ పర్యటనలో పార్టీ అధినాయకత్వంతో సమావేశం అయ్యారు. గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. దసరా నాడు విస్తరణకు నిర్ణయించారని సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో పార్టీ అధినాయకత్వంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో హైడ్రా వివాదం తో పాటుగా ప్రస్తుత పరిణామాల పైన చర్చించారు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించటంతో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పెండింగ్ పదవుల భర్తీ పైన చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో తీసుకొనే వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. విస్తరణ ఖరారు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది.