రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. తాజా బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసింది. దీని వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతలకు రైతు బంధు స్కీమ్ తీసుకువచ్చింది. దీని ద్వారా ఏటా రైతులకు ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇంకా రూ.2 లక్షల రుణ మాఫీ కూడా ప్రకటించింది. తొలి విడత ఇప్పటికే అయిపోయింది. అంతేకాకుండా రైతుల కోసం ఫసల్ బీమా యోజన స్కీమ్‌లో కూడా చేరుతామని తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. దీని వల్ల కూడా అన్నదాతలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. అన్నదాతలకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ డబ్బులు అందిస్తామని ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో వెల్లడించింది. అయితే ఈ ఫెసిలిటీ అందరికీ ఉండదు. కేవలం సన్న బియ్యం పండించే వారికి ఈ ప్రయోజనం లభిస్తుందని తెలిపింది.
తాజా బడ్జెట్‌లో రైతులకు గుడ్ న్యూస్..
