2007లో జడ్పీటీసీగా ప్రయాణం ప్రారంభం 2023లో సీఎం ఇది రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్. ఐదేళ్ల క్రితం పట్టుబట్టి ఎమ్మెల్యేగా ఓడించిన పార్టీని అధికారం నుంచి దూరం చేశాడు. జైలుకు పంపించిన సీఎంను ఇంటింకి పంపించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. దెబ్బ తింటున్నా రక్తం కారుతున్నా కిందకేసి కొడుతున్నా వెంటాడి వేటాడి ఓడించినా ఎక్కడా వణకలేదు, బెణకలేదు, లోంగలేదు రేవంత్ రెడ్డి. పాతాళానికి పంపాలని చూసినవాళ్లకి అధోపాతాళానికి పంపారు రేవంత్‌రెడ్డి గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తొక్కలని చూస్తే తొక్కించుకునే రకం కాదు రేవంత్ తొక్క తీస్తా అనే రకం అదే రేవంత్‌రెడ్డి మొదటి గెలుపు సూత్రం. చుట్టూ ప్రతికూలతలున్నా ఉప్పెనలు, తుపానులు ముంచెత్తినా వాటన్నిటిని తప్పించుకోని ఆకాశమంత ఎత్తుకు ఎగరగలడు రేవంత్. తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాల ఎత్తులను చిత్తు చేసి, కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కింది.
పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి..
