తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత..

hyd-04.jpg

తెలంగాణలో శీతాకాలం ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ ఏడాది చలి తీవ్రత గతేడాది కంటే మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. రెండు రోజులుగా రాష్ట్రంలో చలి విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వివరించారు. ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత భారీగా ఉండే అవకాశమున్నందున ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమయానికి చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశముందని తెలిపారు. ఈశాన్య గాలులు రాష్ట్రంలో చురుకుగా వీస్తుండటం, తూర్పు గాలుల ప్రభావం కూడా ఉండటంతో చలి తీవ్రతతో పాటు పొగమంచు కూడా అధికంగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Share this post

scroll to top