రేవంత్ సర్కార్ బతుకమ్మ పండుగ కానుక అదరహో..

ravanth-10.jpg

బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలోని ప్రముఖ పండుగల్లో ఇది కూడా ఒకటి. బతుకమ్మ పండుగ దగ్గరకు వస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఫెస్టివల్‌కు మహిళలకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగ వస్తోందంటే మహిళలకు చీరలు అందించేది. ప్రతి సంవత్సరం బతుకమ్మకు ప్రభుత్వం నుంచి మహిళలకు చీరలు వస్తూనే ఉండేవి. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆలోచిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ఇచ్చే బతుకమ్మ చీరలపై పలు విమర్శలు వచ్చేవి. చీరలలో నాణ్యత లేదని మహిళలు విమర్శించిన ఘటనలు మనం చూసే ఉంటాం.

అయితే ఈసారి మాత్రం ఇలా జరగకుండా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటోంది.రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం చీరలు పంపిణీ చేయవద్దనే నిర్ణయానికి వచ్చింది. అంటే బతుకమ్మ చీరలు ఉండకపోవచ్చు. మరీ చీరలు లేకపోతే ఎలా? మహిళలకు ఏం ఇస్తుంది? బతుకమ్మ చీరలు బదులుగా మహిళలకు పండుగ కానుకగా ఏం ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఏదైనా బహుమతి ఇవ్వాలా? లేదంటే నగదు రూపంలో అందించాలనే అనే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సర్వత్రా వినిపిస్తోంది.

Share this post

scroll to top