తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వేళ నల్గొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు చుక్కెదురైంది. నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. 15 రోజుల్లోగా పార్టీ భవనాన్ని ఖాళీ చేయించి కూల్చివేయాలని స్పష్టం చేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి రూ. లక్ష జరిమానా విధించింది. ఆఫీసు నిర్మించాక అనుమతి ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ పార్టీ భవనాన్ని కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత..
