తెలంగాణ వ్యవసాయ రంగానికి సువర్ణ అధ్యాయం.. 

harish-26.jpg

ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి అని, తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. 2023-24 సవంత్సరానికి గాను వరి ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో, పత్తి ఉత్పత్తిలో 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేసిన హరీశ్ రావు ఈ ఘనత మంత్రమేస్తేనో మాయ చేస్తేనో జరిగింది కాదన్నారు. ఇదంతా ఒక్క రొజులో జరిగింది కాదని 9 ఏండ్ల కేసీఆర్ కృషి, పట్టుదల, విజనరీ లీడర్ షిప్ వల్ల సాధ్యపడిందన్నారు. కేసీఆర్ కష్టపడి సాధించిన విజయంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం స్వారీ చేస్తున్నదని సెటైర్ వేశారు. పంటల సాగులో మేటి మన తెలంగాణ దేశానికే ఆదర్శం మన తెలంగాణ అన్నారు.

Share this post

scroll to top