తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మరో 2 రోజులపాటు వర్షాలు కురువనున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుంది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగాల 2 రోజులలో తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. తెలంగాణలో మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వానలు కురవనున్నాయి.
మరో 2 రోజులు భారీ వర్షాలు..
