బెట్టింగ్ యాప్స్ కేసులపై పోలీస్‌శాఖ లీగల్ ఒపీనియన్‌కు వెళ్లబోతుంది. స్కిల్ బేస్డ్ గేమ్స్‌కి మాత్రమే ప్రకటనలు చేశామంటున్నారు విజయ్, రానా. అయితే సెలబ్రిటీల నుంచి కీలక అంశాలు రాబట్టిన పోలీసులు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపైన ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు 108 అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లు బ్లాక్ చేశారు. మరో 133 బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ వెబ్‌సైట్లు తెలంగాణలో యాక్సెస్ కాకుండా. జియో-ఫెన్సింగ్ టెక్నాలజీతో TGCSB చర్యలు తీసుకుంటోంది.
కాగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరి, తేస్టీ తేజ, కిరణ్‌గౌడ్‌లను పోలీసులు విచారించారు. శ్యామల, అజయ్ సన్నీ, సుప్రీత, సన్నీ సుధీర్‌లను విచారణ కోసం సంప్రదించగా వారి ఫోన్లు స్విచాఫ్ వచ్చినట్లు సమాచారం. అలాగే మరికొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీయాదవ్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌తో సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు భారీగా లబ్ధి పొందారని, అసలు వారికి ఏయే మార్గాల్లో డబ్బు వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.