తెలుగు నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో రాజేంద్రప్రసాద్‌ను సినీ నటులు పరామర్శిస్తున్నారు. హీరో చిరంజీవి సైతం రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో చిరంజీవిని హత్తుకుని రాజేంద్రప్రసాద్ బోరున ఏడ్చారు. దీంతో రాజేంద్రప్రసాద్‌ను చిరంజీవి ఓదార్చారు. ధైర్యం చెప్పారు. రాజేంద్రప్రసాద్ కూతురు చిన్న వయసులోనే హఠాన్మరణం చెందడం తమను ఎంతగానో కలచివేసిందని చిరంజీవి కుటుంబం ప్రకటించింది. కాగా చిరంజీవి, రాజేంద్రప్రసాద్ మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులతోనూ సినిమాల్లో రాజేంద్రప్రసాద్ నటించారు.
చిరంజీవిని హత్తుకుని ఏడ్చిన రాజేంద్రప్రసాద్..
