రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని ముచ్చట చెప్పింది. రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి ఏప్రిల్ 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వాన పడే అవకాశం ఉందని వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్ 4న వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 2, 3 తేదీల్లో పగటి ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
రాష్ట్ర వాసులకు కూల్ న్యూస్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
