2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత జవాబుదారీతనంలో ప్రభుత్వం సాగుతోందని అన్నారు. జోడు గుర్రాల సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని నమ్ముతున్నామని అన్నారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని తెలిపారు. గత ప్రభుత్వం సృష్టించిన సవాళ్లను ఏడాదిలోని దాటేశామని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు మూసీ సుందరీకరణ, మెడికల్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించామని అన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేలా కేటాయింపులు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు తెలిపారు.
ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం..
