అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో చాలా వరకు అమలు చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రుణమాఫీపై దృష్టి పెట్టింది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణ మాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ ఇప్పటికే రెండు విడతల్లో రూ.లక్ష, లక్షన్నర వరకు మాఫీ చేసింది. ఆగస్టు 15 నాటికి మూడో విడత కూడా పూర్తి చేస్తామన్నది. ఇది పూర్తైన తర్వాత మిగిలి ఉన్న ప్రధాన హామీ రైతు భరోసా. దీనిపై తాజాగా ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఇదే పథకం కింద ఎకరాకు రూ.10 వేల రూపాయలు రెండు దఫాల్లో ఇచ్చేది. ఆమొత్తాన్ని కాంగ్రెస్ సర్కార్ 15 వేలకు పెంచింది. అంతేకాక కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నది. ఇకపోతే.. నిన్నటివరకూ రైతు భరోసా 2 దశల్లో అమలు చెయ్యాలని అనుకున్నా.. ఇప్పుడు ఒకే దశలో అమలు చేసి, ఒకేసారి రూ.15,000 ఇవ్వాలని భావిస్తోందట ప్రభుత్వం.
అకౌంట్లలోకి రూ.15 వేలు..
