యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగావిడుదల అయ్యింది. ఇప్పటికే ప్రీమీయర్స్ చూసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్ అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అంటున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్యను చూసి అంతా సర్ ప్రైజ్ అవుతారని అంతలా అద్భుతంగా నటించేశాడని అంటున్నారు.
తండేల్ మూవీ రివ్యూ..
