గోదావరి నది తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు విపరీతంగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుండటంతో దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టు దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. భద్రాచలం దగ్గర నీటిమట్టం మంగళవారం సాయంత్రం 6 గంటలకు 48.20 అడుగులుగా నమోదవ్వగా.. ఈ రోజు ఉదయానికి వరద నీటి మట్టం 54 అడుగులు ధాటి ప్రమాదకరంగా గోదావరి ప్రవహిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలోకి 27 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.
తీవ్ర ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది..
