మరోసారి రైతులకు శుభవార్త అందించింది. రూ. లక్షలోపు రుణమాఫీ అయిన రైతులకు వెంటనే లోన్లు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లను ఆదేశించారు. లోన్ రెన్యువల్ చేసుకున్న రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని సూచించారు. దీనికోసం ప్రతి బ్యాంకులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు సంబంధించిన డీసీసీబీలకు ప్రభుత్వం నుంచి విడుదలైన నగదు మొత్తాన్ని ఒకటి, రెండు రోజుల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రుణమాఫీకి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం రూ. లక్ష వరకు రుణమాఫీ నిధులు విడుదల చేశారు. దీంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం
ఆరు నెలల్లోనే రుణమాఫీ..
