ఆయుర్వేద వైద్యశాస్త్రంలో అల్లంకు విశేష ప్రాధాన్యత ఉంది. కేవలం కూరల్లోనే కాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు అల్లం విశేషంగా వినియోగిస్తారు. అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. చాలా రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. పరగడుపున ప్రతిరోజూ ఉదయం అల్లం రసం తాగితే చాలా ప్రయోజనాలున్నాయి.
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపున అల్లం రసం తాగితే బరువు తగ్గడమే కాకుండా..శరీరం మెటబోలిజం కూడా మెరుగవుతుంది. ఫలితంగా రోజంతా మనిషి యాక్టివ్‌గా ఉంటాడు. రోజూ పరగడుపున అల్లం రసం తాగడం వల్ల చర్మానికి కూడా చాలా మేలు చేకూరుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పలు సమస్యల్నించి దూరం చేయడమే కాకుండా..చర్మంపై పింపుల్స్, యాక్నే, మొటిమలు వంటివి రాకుండా కాపాడుతుంది. వాపు దూరం చేసేందుకు కూడా అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందుకు ఉపయోగపడతాయి.