పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘కల్కిఏడి2898 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అదే ఫామ్‌తో ఉన్నారు. ప్రజెంట్ కల్కి-2, సలార్-2, రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్ వంటి చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ‘స్పిరిట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు టాక్.
ఇటీవల దీనికి సంబంధించిన మ్యూజిక్ పనులు కూడా మొదలయ్యాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు హర్షవర్ధన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా, ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న భూషణ్‌కుమార్ ఓ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా స్పిరిట్’పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మేము ప్రస్తుతం స్పిరిట్ సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నాము. అందులోని నటీనటుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు.